Type Here to Get Search Results !

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం

NAMASTHE NEWS 0

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం




రామన్నపేట అక్టోబర్ 8 (నమస్తే న్యూస్)

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రామన్నపేట మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో సుభాష్ సెంటర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు పున్న జగన్మోహన్  అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ బిక్షం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్  పూస బాలకిషన్, అబ్రహం కుమార్, గుత్తా నర్సిరెడ్డి, , వనం చంద్రశేఖర్, ఎండీ అక్రమ్, అంజిరెడ్డి, ఎండీ నాసర్, శంబాల వెంకన్న, కోట సుధాకర్, బొడ్డు సురేందర్‌రావు, అయ్యాడపు నర్సిరెడ్డి, లింగారెడ్డి, ఇనాయత్‌ బేగ్, జానీ తదితర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System