సిఐటీయు నాయకురాలు మృతి....సి పి ఐ ఎం నేతల పరామర్శ.
కారంపురి వెంకటేశ్వర్లు నేత. 7893556455.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 04, (నమస్తు న్యూస్)
మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది.సి ఐ టీ యు అనుబంధ సంఘమైన బిల్డింగ్ వర్కర్స్ సంఘం మండల కన్వీనర్ కొండ ఉప్పలయ్య సతీమణి కొండ ఉప్పలమ్మ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.ఆమె మృతి వార్త తెలియగానే సి పి ఐ ఎం పార్టీ నాయకులు అబ్బాయిపాలెంకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా వారు ఉప్పలమ్మ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య,మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్,మండల ఆర్గనైజర్ బాణాల రాజన్న,నలబోలు లక్ష్మారెడ్డి,తుమ్ విజయ,పోలేపాక గణేష్,ఆనపురం మాజీ సర్పంచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

