క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే "జైల్ భరో" కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు.
రామన్నపేట,ఆగస్ట్ 03(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించనున్న "జైల్ భరో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కక్కిరేణి గ్రామంలో కార్మికులతో కలిసి జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గొరిగే సోములు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరంలో కీలక మలుపు తిప్పిన క్విట్ ఇండియా ఉద్యమం ప్రజలకు పోరాట స్ఫూర్తిని, ఐక్యతను అందించిందన్నారు. అదే స్ఫూర్తితో నేడు ప్రజల హక్కుల పరిరక్షణ, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కర్మిక వర్గ సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 10న "జైల్ భరో" కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రజా, వర్గ సంఘాల నాయకులు కన్నెబోయిన యాదయ్య , వేముల సైదులు , గ్రామ కార్మికులు బడే సత్తయ్య , కోట వెంకన్న , కిన్నెర రమేష్, కట్ట భిక్షం, నర్సింహ, యశోద తదితరులు పాల్గొన్నారు.

