Type Here to Get Search Results !

బోన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడికి ఆపన్నహస్తం అందించండి.

NAMASTHE NEWS 0

బోన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడికి ఆపన్నహస్తం అందించండి.
గుగులోతు పార్ధును పరామర్శించిన సిపిఐ జిల్లా సమితి సభ్యుడు అబ్దుల్ రషీద్.



డోర్నకల్/మరిపెడ(జులై 03)నమస్తే న్యూస్.మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుకు చెందిన గుగులోతు వీరేందర్ కుమారుడు గుగులోతు పార్ధు 22 బోన్ క్యాన్సర్ జిసిటిబి వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు.విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎండి అబ్దుల్ రషీద్ శుక్రవారం పార్ధును పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ,పార్ధు కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని,చికిత్స ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నారని తెలిపారు.దాతలు,ప్రజాప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థలు,సేవాభావం ఉన్న ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.మీరు చేసే సహాయం చిన్నదైనా ఒక ప్రాణానికి రక్ష.సహాయం చేయాలనుకునే వారు పోస్టర్‌లో ఉన్న PhonePe,Google Pay QR కోడ్ ద్వారా లేదా PhonePe,Google Pay నంబర్ 9949610684కు నేరుగా విరాళాలు పంపవచ్చని తెలిపారు.మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక యువకుడి జీవితంలో కొత్త ఆశను నింపుతుంది.దయచేసి స్పందించి మానవత్వాన్ని చాటండి"అని ఎండి అబ్దుల్ రషీద్ కోరారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System