Type Here to Get Search Results !

అవినీతికి కేంద్రంగా మాకుల క్షేత్రం...సమగ్ర విచారణ జరపాలని లంబాడీల ఐక్య వేదిక డిమాండ్

NAMASTHE NEWS 0

అవినీతికి కేంద్రంగా మాకుల తండా భావసంగ్ మహారాజ్ మ్యారమా భవానీ క్షేత్రం.
సమగ్ర విచారణ జరపాలని లంబాడీల ఐక్య వేదిక డిమాండ్.


డోర్నకల్/మరిపెడ(జులై 03)నమస్తే న్యూస్.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలం మాకుల తండా శివారులో ఉన్న భావసంగ్ బావ మ్యారమా భవాని మాకుల క్షేత్రంలో అక్రమ కట్టడాలు,అక్రమ వ్యాపారాలతో దేవాలయ ఆదాయానికి గండి పడుతోందని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ ఆరోపించారు.ఆయన మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పలు ఆరోపణలు చేశారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం మ్యారమా భవాని జగదాంబ యాడి వైష్ణవ దేవి పేరు మీద దేవాలయ నిర్మాణం జరిగిందని,టీటీడీ ద్వారా విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని తెలిపారు.అయితే మారెమ్మ తల్లి పేరుతో పోస్టర్లు,బ్యానర్లు తీయించి గత రెండేళ్లుగా వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు.అలాగే ఆలయ ప్రాంగణంలో మాజీ అధికారి అక్రమ నిర్మాణం చేపట్టి ప్రతి నెలా కిరాయి వసూలు చేస్తున్నారని,దీంతో దేవాలయ ఆదాయానికి నష్టం జరుగుతోందని తెలిపారు.ఆలయం చుట్టూ ఎలాంటి టెండర్లు లేకుండా మద్యం,టెంటు,కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు.మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేందర్ రెడ్డి దేవాలయం కోసం,భక్తుల కోసం రెండు ఎకరాల భూమి వదిలిపెడితే,అందులోనూ అక్రమ కట్టడాలు నిర్మించి ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు.దేవాలయానికి అధికారిక కమిటీ లేకపోవడం శోచనీయమని అన్నారు.గత రెండు మూడేళ్లుగా ఆలయ కేంద్రంగా వివిధ వివాదాలు జరుగుతున్నా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.కావున ఈ ఆలయంలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి,పారదర్శకంగా కమిటీ వేయాలని లంబాడీల ఐక్య వేదిక తరపున డిమాండ్ చేస్తున్నామని జాదవ్ రమేష్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి బానోత్ ప్రవీణ్ నాయక్,జిల్లా విద్యార్థి విభాగ సమన్వయకర్త గుగులోతు వాసు నాయక్,నియోజకవర్గ విద్యార్థి సమన్వయకర్త రాజేందర్ నాయక్,మరిపెడ మండల ఇంచార్జి గుగులోతు దేవేందర్ నాయక్,మండల కార్యదర్శి రాజేష్ నాయక్,మండల జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ నాయక్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System