Type Here to Get Search Results !

ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే రామచంద్రు నాయక్

NAMASTHE NEWS 0

ప్రి-ప్రైమరీ తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాంచంద్రునాయక్.


డోర్నకల్/మరిపెడ,జులై 08(నమస్తే న్యూస్).

గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్ అన్నారు.మరిపెడ పట్టణంలోని సీతారాంపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రి-ప్రైమరీ తరగతి గదులను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్-డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై  తరగతులను ప్రారంభించారు.ఆయనతో పాటు మరిపెడ మున్సిపల్ ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.చిన్న వయసు నుంచే పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రి-ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నామని చెప్పారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి,సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి అనితా దేవీ,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు,మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే కౌన్సిలర్లు మెరుగు రాము,జాటోతు సురేష్,పానుగోతు రాములు,నీలా లచ్చిరామ్,కాంతమ్మ కరణ్ సింగ్,తిరుపతి,గంట్ల గౌతమ్ రెడ్డి,పాఠశాల హెచ్ ఎం అర్జున్ హాజరయ్యారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా మైనార్టీ నాయకులు అఫ్జల్,టౌన్ అధ్యక్షులు తాజోద్దీన్,వెంకట సాయి,యాకుబ్ పాషా,అనంతగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.ప్రి-ప్రైమరీ తరగతుల ప్రారంభంతో సీతారాంపురం పాఠశాలలో చదువుకునే చిన్నారులకు మరింత సౌకర్యం కలుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.








Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System