Type Here to Get Search Results !

గిరిపురంలో వార్డు సభ్యులకు 3వ రోజు ఓరియంటేషన్ శిక్షణ.

NAMASTHE NEWS 0

గిరిపురంలో వార్డు సభ్యులకు 3వ రోజు ఓరియంటేషన్ శిక్షణ.
పంచాయతీ రాజ్ చట్టాలుపై వార్డు సభ్యులకు అవగాహన సదస్సు.
సమర్థ పాలన కోసం వార్డు సభ్యులకు శిక్షణ.




డోర్నకల్/మరిపెడ(జులై 08)నమస్తే న్యూస్.

మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో బుధవారం వార్డు సభ్యులకు మూడవ రోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో ట్రైనర్లు రామోజీ,వెంకన్న,ప్రణయ్ పాల్గొని వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టాలు,గ్రామాభివృద్ధి పథకాలు,పరిపాలన విధి విధానాలపై వివరంగా అవగాహన కల్పించారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన,నిధుల వినియోగం,15వ ఆర్థిక సంఘం నిధులు,స్వచ్ఛ భారత్,హరితహారం,ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల అమలు తీరు గురించి ట్రైనర్లు వివరించారు.వార్డు స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించే బాధ్యత,ప్రజలతో సమన్వయం,పారదర్శక పాలన ప్రాముఖ్యత గురించి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.ప్రతి వార్డు సభ్యుడు తమ వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి.పథకాల లబ్ధి అర్హులకు చేరేలా చూడాలి" అని ట్రైనర్లు సూచించారు.అలాగే ప్రభుత్వ ఆదేశాలు,మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిపురం పంచాయతీతో పాటు పరిసర గ్రామా పంచాయితీలకు చెందిన వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.శిక్షణ ద్వారా తమ బాధ్యతలు,అధికారాలపై స్పష్టత వచ్చిందని వార్డు సభ్యులు తెలిపారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System