Type Here to Get Search Results !

అబ్బాయిపాలెంలో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన.

NAMASTHE NEWS 0

  • అబ్బాయిపాలెంలో నీటి కొరతతో మహిళల ఆందోళన. 
  • ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన నాలుగో వార్డు మహిళలు.

ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు


డోర్నకల్/మరిపెడ,జులై 04(నమస్తే న్యూస్).

మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో గత ఆరు నెలలుగా తీవ్ర నీటి కొరత నెలకొంది.దీంతో విసిగిపోయిన గ్రామంలోని నాలుగో వార్డు మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. గ్రామపంచాయతీ పాలకవర్గానికి, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పైప్‌లైన్ ఉన్నప్పటికీ మెయిన్ వాల్ మార్చకపోవడం,నీటి ప్రెషర్ తక్కువగా ఉండటం వల్ల నీళ్లు రావడం లేదని తెలిపారు. గత 6 నెలలుగా కార్యదర్శి,సర్పంచ్‌కు చెబుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు సరిగా రాకపోవడంతో ఇంటి వద్ద నీటి ట్యాంకులు, బిందెలు ఖాళీగా మిగిలిపోతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం వార్డ్ సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో వంగూరు ఉప్పలయ్య, ఉప్పలమ్మ, తిప్పర్తి మైసమ్మ, జిన్నా ఉపేంద్ర, సోమయ్య, ధనమ్మ, మైసయ్య, తీగల పూలమ్మ, భిక్షం, గంగ రాము, సుజాత, సైదులు, జ్యోతి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System