Type Here to Get Search Results !

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ తక్షణమే తిరిగి ప్రారంభించాలి:సిపిఐ

NAMASTHE NEWS 0

  • ఏపీఎం నిర్లక్ష్యంతో మూతపడిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్.  
  • తక్షణమే తిరిగి ప్రారంభించాలని సిపిఐ డిమాండ్.
  • సీపీఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని భాలకృష్ణ.




డోర్నకల్/మరిపెడ,జులై 04(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని స్థానిక మార్కెట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటిన్ ను పునః ప్రారంభించాలని,మహిళలకు ప్రభుత్వం కలిపించిన ఆర్ధిక వెసులుబాటును అధికారుల నిర్లక్ష్యంతో కుంటుపడి పోయింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మరిపెడ మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో మూతపడింది. మరిపెడ మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో మంజూరైన ఈ క్యాంటీన్,మండల సమైక్య ఏపీఎం నిర్లక్ష్యం కారణంగా మూతపడిందని సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల గ్రూపుల ద్వారా బ్యాంక్ లింకేజీలు, వివిధ సంక్షేమ పథకాలతో మహిళల అభివృద్ధిని కోరుకుంటుందని, కానీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ సంకల్పం నీరుగారుతుందని అన్నారు.మరిపెడ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ క్యాంటీన్‌ను తక్షణమే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధికారులు, ప్రభుత్వం పై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, లింగయ్య, రాములు, లచ్చు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System