Type Here to Get Search Results !

మరిపెడ ఆదర్శ పాఠశాలలో ఖాళీల భర్తీకి అడ్మిషన్స్: ప్రిన్సిపాల్ అక్తరుజ్జమన్.

NAMASTHE NEWS 0

  • మరిపెడ ఆదర్శ పాఠశాలలో ఖాళీల భర్తీకి అడ్మిషన్స్.
  • పాఠశాల ప్రిన్సిపాల్ అక్తరుజ్జమన్.



డోర్నకల్/మరిపెడ(జులై 06)నమస్తే న్యూస్.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్స్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ 6,7,9తరగతులు,ఇంటర్MPC,BiPC,CEC,ఏస్ సీట్లు ఖాళీ స్థానిక మరిపెడ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ఏర్పడిన ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు.పాఠశాల ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం,6వ తరగతి,7వ తరగతి,9వ తరగతి తో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం MPC,BiPC,CEC మరియు ACE గ్రూపుల్లో ఖాళీలు ఉన్నాయి.ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే మంగళవారం ది.7/07/2026 న ఉదయం 10 గంటలకు పాఠశాల ఆవరణలో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ జరుగుతుంది.ప్రవేశం కోరుకునే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు, T.C, స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం,ఆధార్ కార్డు పైన పేర్కొన్న అన్ని పత్రాలకు సంబంధించి 2 సెట్ల జిరాక్స్ కాపీలు కూడా తప్పనిసరిగా తీసుకురావాలి.అర్హత గల విద్యార్థులు,తల్లిదండ్రులు నిర్ణీత తేదీ,సమయానికి పాఠశాలకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System