Type Here to Get Search Results !

గిరిపురం రైతు వేదికలో నూతన వార్డు సభ్యులకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం.

NAMASTHE NEWS 0

  • గిరిపురం రైతు వేదికలో నూతన వార్డు సభ్యులకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం.
  • కార్యక్రమానికి హాజరై మాట్లాడుతున్న ఎంపీఓ సోమ్లాల్.




డోర్నకల్/మరిపెడ(జులై 05)నమస్తే న్యూస్.

మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామపంచాయతీ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు మొదటి రోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైనది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీఓ సోమ్లాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచబడిన పంచాయతీరాజ్ చట్టాలు,అలాగే గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, నిధుల వినియోగంలో పారదర్శకత,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వార్డు సభ్యుల పాత్ర కీలకమని తెలిపారు.ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యను సానుకూలంగా స్వీకరించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం గిరిపురం గ్రామపంచాయతీ సర్పంచ్ నీలా సైదులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యత, గ్రామ అభివృద్ధికి ఎంతో అవసరం ఉన్నదని అన్నారు.అందరూ ఐకమత్యంగా,సమన్వయంతో పనిచేసి గిరిపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాలని ఆకాంక్షించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా నియమిత ట్రైనర్లు రామోజీ,సుమన్, వెంకన్న, దేవయ్య పంచాయతీ సమావేశాల నిర్వహణ, తీర్మానాల నమోదు,ఆర్థిక లావాదేవీల లెక్కలు,రికార్డుల నిర్వహణ మరియు గ్రామసభల నిర్వహణపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విజిత,మమత,అశోక్,ఉమేష్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉమేష్ పాల్గొని ప్రభుత్వ యాప్‌ల వినియోగం,ఆన్‌లైన్ బిల్లుల ప్రాసెస్,ఫిర్యాదుల నమోదు విధానంపై సాంకేతిక శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System