Type Here to Get Search Results !

అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరపాలి: న్యూ డెమోక్రసీ

NAMASTHE NEWS 0

 

  • ఒకే కుటుంబంలో రెండు ఉద్యోగాలు రెండు ఇందిరమ్మ ఇండ్లు ఇదెక్కడి న్యాయం.
  • అర్హులైన నిరుపేదలకు ఉద్యోగాలు ఇవ్వాలి – అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరపాలి.
  • రాజకీయ ఒత్తిళ్లతో కాదు, ప్రతిభతోనే ఉద్యోగాలు ఇవ్వాలి.
  • ప్రజల స్వేచ్ఛను హరించే రాజకీయ బెదిరింపులను ఖండిస్తున్నాం.
  • బిఆర్ఎస్-న్యూడెమోక్రసి పార్టీల నిరసన కార్యక్రమం.



తిరుమలాయపాలెం,జూలై 20 (నమస్తే న్యూస్)

అర్హత కలిగిన నిరుపేద కుటుంబం నందిపాటి సృజన, రామనబోయిన రజితలకు ఉద్యోగం కల్పించకుండా, నిబంధనలకు విరుద్ధంగా అనర్హులత కలిగినవారికి  ఉద్యోగాలు ఇవ్వడం తీవ్రంగా ఖండించదగిన విషయం అని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు జక్కుల యాదగిరి  అన్నారు.

 ఈరోజు బచ్చోడు గ్రామంలో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చోడు గ్రామంలో ప్రీ ప్రైమరీ  ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, సమానత్వం, సామాజిక న్యాయం పాటించకుండా నియంతృత్వ ధోరణి తో నిజంగా అర్హత కలిగిన అభ్యర్థులను పక్కనపెట్టి, అనర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడితే అది యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందనీ . అందువల్ల సంబంధిత అధికారులు నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి, ఎంపికలో జరిగిన అక్రమాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అన్ని నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వారు డిమాండ్ చేశారు.అర్హుల హక్కుల కోసం సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బిఆర్ఎస్ పార్టీలు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్  గుజ్జా రామకృష్ణ నిరసన సభకు అధ్యక్షత వహించారు. అర్హత కలిగిన అభ్యర్థి నందిపాటి సృజన భావోద్వేగానికి గురై మాట్లాడినారు. సందు రాజు, వేములపల్లి మల్లికార్జున్, నందిపాటి లక్ష్మీనారాయణ, గొర్రెపాటి లింగయ్య, దారమల్ల కృష్ణ, భగత్ సింగ్,లెనిన్,నందిపాటి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System