Type Here to Get Search Results !

మరిపెడ పీహెచ్‌సీ పరిధిలో పిల్లలందరికీ ఆల్బెండజోల్ మోప్ అప్ డే.

NAMASTHE NEWS 0

  •  మరిపెడ పీహెచ్‌సీ పరిధిలో పిల్లలందరికీ ఆల్బెండజోల్ మోప్ అప్ డే.
  • 1 నుండి 19 ఏళ్ల వయస్సు వారికి ఆల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణీ. 
  • నులిపురుగుల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్.
  • పాఠశాలలు,అంగన్‌వాడీలలో మాత్రల పంపిణీ.
  • ఉపాధ్యాయులు,ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో విజయవంతం.
  • ప్రాథమిక ఆరోగ్యకేంద్ర డాక్టర్ గుగులోత్ రవి ఆధ్వర్యంలో.







డోర్నకల్/మరిపెడ(జూలై 20) నమస్తే న్యూస్.

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ‘మోప అప్ డే’ విజయవంతంగా నిర్వహించారు. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యువతకు ఆల్బెండజోల్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. గత సోమవారం జరిగిన జాతీయ నులి పురుగుల దినోత్సవం రోజున వివిధ కారణాల వల్ల టాబ్లెట్ వేసుకోలేకపోయిన పిల్లల కోసం ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ..ఈ కార్యక్రమం అందరి సహాకారంతో వజయవంతం అయినదాని తెలిపారు.మరిపెడ పీహెచ్‌సీ పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు,ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు,ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలకు వైద్య సిబ్బంది నేరుగా వెళ్లి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించారని అన్నారు. సిబ్బంది,ఉపాధ్యాయుల సమన్వయం.పిల్లల్లో నులిపురుగుల నివారణ, శారీరక-మానసిక ఎదుగుదల, రక్తహీనత నిర్మూలనకు ఈ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి,డాక్టర్ కిరణ్,హెల్త్ సూపర్‌వైజర్లు ఆచార్యులు, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది ఝాన్సీ, అఖిల, సతీష్, ఉపేంద్ర, ఏఎన్ఎంలు అనిత, సౌజన్య, సరిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వారితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు చొరవ తీసుకుని ఒక్క విద్యార్థి కూడా మిగలకుండా మాత్రలు అందేలా చర్యలు తీసుకున్నారు.వారి సహకారంతో ఈ డ్రైవ్ పెద్ద ఎత్తున విజయవంతమైందని తెలియచేశారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System