Type Here to Get Search Results !

హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీఓ.

NAMASTHE NEWS 0

వసతి గృహాల తనిఖీ చేసిన ఎంపీడీవో రాంప్రసాద్ రావు.
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీఓ.




నర్సింహులపేట, జూలై 10 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) జి. రాంప్రసాద్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ బాలుర హాస్టల్‌తో పాటు జీహెచ్ టీజీఎంఎస్ (GH TGMS) హాస్టల్‌ను సందర్శించి అక్కడి వసతులు, విద్యార్థులకు అందుతున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.తనిఖీలో భాగంగా హాస్టళ్లలో భోజన తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత, కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యత, వంట సామగ్రి, నిల్వ విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా, ఆహారం రుచి, నాణ్యత, పరిశుభ్రత ఎలా ఉన్నాయనే అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి విద్యాభ్యాసం, హాస్టళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులతో చర్చించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా హాస్టళ్లలో కొన్ని మౌలిక వసతుల లోపాలను గుర్తించిన ఎంపీడీఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతి గృహంలో డ్రైనేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డెన్ వివరించగా, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు ప్రతిరోజూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, హాస్టల్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్లు, సిబ్బందికి ఎంపీడీఓ రాంప్రసాద్ రావు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది, మండల పంచాయతీ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System