Type Here to Get Search Results !

మరిపెడ మండలం గిరిపురంలో వార్డు సభ్యులకు 4వ రోజు ఓరియంటేషన్ శిక్షణ.

NAMASTHE NEWS 0

  • మరిపెడ మండలం గిరిపురంలో వార్డు సభ్యులకు 4వ రోజు ఓరియంటేషన్ శిక్షణ.
  • పంచాయతీ రాజ్ చట్టాలు,గ్రామాభివృద్ధిపై ట్రైనర్ల అవగాహన.


డోర్నకల్/మరిపెడ(జులై 09)నమస్తే న్యూస్.

మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీలోని రైతు వేదికలో గురువారం నాల్గవ రోజు గ్రామపంచాయతీ వార్డు సభ్యుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శిక్షణా ట్రైనర్లు వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టాలు,నిబంధనలు,గ్రామాభివృద్ధి ప్రణాళికలు,పరిపాలనా విధివిధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన,పారిశుద్ధ్యం,తాగునీరు,నిధుల వినియోగం,ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సభ్యులకు పలు సూచనలు చేశారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని,ప్రతి సభ్యుడు బాధ్యతగా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ట్రైనర్లు సూచించారు.అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేసే బాధ్యత వార్డు సభ్యులదేనని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రైనర్లు ప్రణయ్,సుమన్,దేవయ్య,పంచాయతీ కార్యదర్శి విజిత,ఆపరేటర్ ఉమా తో పాటు ఆయా గ్రామాల నుండి వచ్చిన వార్డు సభ్యులు పాల్గొని శిక్షణ సద్వినియోగం చేసుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System