Type Here to Get Search Results !

మాలోతు రాంకోటి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. .

NAMASTHE NEWS 0

  • మాలోతు రాంకోటి కుటుంబానికి పరామర్శ.
  • మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాంకోటికి నివాళి.




డోర్నకల్/మరిపెడ,జూన్ 10(నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండా గ్రామపంచాయతీ పరిధిలోని మంజ్య తండ గ్రామంలో ఇటీవల మరణించిన మాలోతు రాంకోటి చిత్రపటానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు.బుధవారం గ్రామానికి చేరుకున్న ఆమె రాంకోటి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ,రాంకోటి అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని,బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఐలి నరహరి గౌడ్,బొడ శ్రీను,గుగులోత్ నెహ్రూనాయక్,బాధే నాగయ్య,హలవత్ శంకర్ నాయక్,ఎడ్జెర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం శ్రీను,ఎల్‌హెచ్‌పీఎస్ నాయకుడు భూక్యా రామ్మూర్తి నాయక్,మాలోత్ నరేష్,మంజా నాయక్,బలరాం నాయక్,జగన్, మమాంజ్య బిక్కు నాయక్,భూక్యా కిస్టు నాయక్,మాలోతు వెంకన్న నాయక్,రఘుపతి,హలవత్ రాములుతో పాటు గ్రామ పెద్దలు,యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాంకోటికి నివాళులర్పించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System