Type Here to Get Search Results !

లక్ష్మాతండ సర్పంచి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి పరిపాలన సభలు.

NAMASTHE NEWS 0



డోర్నకల్/మరిపెడ,జూన్ 10(నమస్తే న్యూస్):

మరిపెడ మండలం లక్ష్మాతండా గ్రామ పంచాయతీలో ప్రజా పాలన ప్రగతి పరిపాలన సభ  సర్పంచి భానోత్ కర్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.సభలో సర్పంచి కర్ణ మాట్లాడుతూ ప్రజా పాలన ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమేనని అన్నారు.గ్రామ ప్రగతి ప్రణాళిక ద్వారా తాగునీరు,పారిశుద్ధ్యం,రోడ్లు,వీధిలైట్లు,విద్య,వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం ఎంపీఓ సోమ్లా నాయక్ మాట్లాడుతూ గ్రామాన్ని,మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అపరిశుభ్రత వల్ల సిజనల్ వ్యాదులు ప్రభలే ప్రమాదం ఉంటుంది కాబట్టి మన పరిసరాలను,మనల్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎలాంటి వ్యాదులు దరి చేరవని గుర్తు చేశారు.గ్రామంలోని ప్రతి ఒక్కరు టాయిలెట్లను వాడాలని,అలా కాకుండా రోడ్ల పక్కన అపరిశుభ్రం చేసుకుంటే వ్యాధులు సోకుతాయన్నారు,అలాగే మన ఇంట్లో వ్యర్ధాలు రోడ్ల పక్కన వేయడంవలన వాటిలో క్రీములు పుడతాయి ఆ క్రీములు మన శరీరాల్లోకి ప్రవేశిస్థాయి వాటివల్ల భయంకరమైన వ్యాదులు సంభవిస్తాయని అన్నారు.ప్రగతి ప్రణాళిక అమలులో అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఉపాధి హామీ పథకం,పింఛన్లు,రేషన్ కార్డులు,ఇతర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.అర్హులెవరూ పథకాలకు దూరం కాకూడదని,అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి,ఏపీవో,ఏఎన్ఎం,ఆశా వర్కర్లు,ఇతర శాఖల అధికారులు,గ్రామ పెద్దలు,మహిళలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System