Type Here to Get Search Results !

తాళ్ల ఊకల్‌లో సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన.. హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు..

NAMASTHE NEWS 0

  • తాళ్ల ఊకల్‌లో గంగదేవి గుడి,బతుకమ్మ ఘాట్‌కు సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన.
  • దశాబ్దాల కల నెరవేరిందన్న గ్రామస్తులు.




డోర్నకల్ /మరిపెడ,జూన్ 25(నమస్తే న్యూస్).మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది.గ్రామంలోని గంగదేవి గుడి మరియు బతుకమ్మ ఆడే ఘాట్‌కు సిమెంటు రోడ్డు మంజూరు కావడంతో గ్రామస్తులు సంబురాలు చేసుకున్నారు.

గురువారం గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్ద కొంపెల్లి సురేందర్ రెడ్డి,గ్రామ సర్పంచి శ్రీను,గ్రామ ఉప సర్పంచి మల్లయ్య ముందుండి నడిపించారు.వీరితో పాటు గ్రామ వార్డు సభ్యులు,గ్రామ యాదవ సంఘం సభ్యులు,మహిళలు,యువకులు,వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు."ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు,బోనాలకు వర్షం వస్తే గుడికి వెళ్లాలంటే బురదలో నడవాల్సి వచ్చేది.వృద్ధులు,చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు.ఇప్పుడు సిమెంటు రోడ్డు రావడంతో మా కష్టాలు తీరినట్టే" అని గ్రామ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.గ్రామ పెద్ద సురేందర్ రెడ్డి మాట్లాడుతూ "గంగదేవి గుడి మా ఊరికి పుణ్యక్షేత్రం.బతుకమ్మ ఘాట్ మా ఆడబిడ్డలకు పవిత్రమైన స్థలం.ఈ రెండు చోట్లకు రోడ్డు లేక చాలా ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.పాలకులకు ఎన్నోసార్లు చెప్పాం.ఇప్పటికి మా మొర విని రోడ్డు మంజూరు చేశారు" అని అన్నారు.సర్పంచి శ్రీను మాట్లాడుతూ "గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.ఈ రోడ్డు వల్ల భక్తులకు,మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.త్వరలోనే నాణ్యతతో పనులు మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తి చేస్తాం.పండుగలు జరుపుకునే నాటికి అందుబాటులోకి తెస్తాం" అని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System