Type Here to Get Search Results !

గిరిపురంలో 8 లక్షలతో సిమెంటు రోడ్డు ప్రారంభం

NAMASTHE NEWS 0

  • గిరిపురంలో 8 లక్షలతో సిమెంటు రోడ్డు ప్రారంభం.
  • అశోక్ ఇంటి నుండి రాములు ఇంటి వరకు.



డోర్నకల్/మరిపెడ(25 జూన్)నమస్తే న్యూస్.

మరిపెడ మండలం గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి.ఉపాధి హామీ పథకం ద్వారా 8 లక్షల రూ.లతో అలువాల అశోక్ ఇంటి నుండి బెల్లి రాములు ఇంటి వరకు ఈ రోడ్డు నిర్మించనున్నారు.గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు.గ్రామ సర్పంచి బాదావత్ నీల సైదులు,ఉప సర్పంచి బానోతు వీరన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ "గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే మా ప్రభుత్వ లక్ష్యం.చాలా కాలంగా ఈ రోడ్డు కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారని,ఉపాధి హామీ నిధులతో నాణ్యమైన రోడ్డు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం" అని అన్నారు.అనంతరం గ్రామ సర్పంచి నీల సైదులు మాట్లాడుతూ "రోడ్డు లేక వర్షాకాలంలో ప్రజలు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారని,ఇప్పుడు సిమెంటు రోడ్డు రావడంతో అందరి కష్టాలు తీరుతాయని,నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం" అని తెలిపారు.గ్రామ ప్రజల సహాకారంతో గ్రామాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని,అలాగే గ్రామంలోని యువత గ్రామ అభివృద్ధికి తొడ్పాటు అందించాలని,భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందని,అలాగే యువత చెడు వ్యాసనాలకు భానిసలు కాకుండా గ్రామ అభివృద్ధికి యువత సహాకారం అందివ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వల్లెపు కొండయ్య,వార్డు సభ్యులు వీరన్న,అశోక్,మహేందర్,యాకూబ్ పాషా,సలీం,శ్రీకాంత్,కలి చాంద్ పాషా,కరీం,గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రోడ్డు మంజూరు కావడంతో గ్రామస్తులు జిల్లా ప్రధాన కార్యదర్శికి,గ్రామ సర్పంచికీ కృతజ్ఞతలు తెలియచేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System