Type Here to Get Search Results !

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేయండి:జెఏసి చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ

NAMASTHE NEWS 0

  • ఈనెల 21 న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేయండి!
  • మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం దాశరథి విగ్రహం ముందు జెఏసి ప్రెస్ మీట్. 
  • పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిన జెఏసి చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ.


చిన్న గూడూరు,జూన్ 19(నమస్తే న్యూస్)

తెలంగాణ ఉద్యమకారులకు‌ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన ప్రకారం అమలుచేయాలని కోరుతూ... ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటుపడాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21 న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్తి గార్డెన్ లో జరిగే ఉద్యమకారుల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సు కు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యమకారుల కమిటీ సభ్యులు యంయల్సీలు ప్రొ.కోదండరాం, అద్దంకి దయాకర్ లు హాజరవుతారని తెలిపారు.ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఈ సదస్సు కు తరలిరావాలని కోరారు.ఈకార్యక్రమంలో నాయకులు మైస శ్రీనివాస్, పిల్లి సుధాకర్, గందసిరి వేణు,ఆంగోత్ చందులాల్, దేశగాని కృష్ణ, పసునాది విజయ్, భూక్య వెంకన్న, దాశరధి మల్లేష్, శ్రీనివాస్, చిన్న గూడూరు సర్పంచ్ బత్తెం రమేష్, ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System