Type Here to Get Search Results !

ఉద్యోగ భద్రత కోసం ఐక్యం కావాలి:మిషన్ భగీరథ ప్లాంట్ అధ్యక్షులు రాయల శ్రీను.

NAMASTHE NEWS 0

ఉద్యోగ భద్రత కోసం ఐక్యం కావాలి.


మిషన్ భగీరథ ప్లాంట్ అధ్యక్షులు రాయల శ్రీను.



డోర్నకల్/మరిపెడ(జూన్ 14)నమస్తే న్యూస్.

మిషన్ భగీరథలో గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని,తమ న్యాయమైన హక్కుల సాధన కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని మిషన్ భగీరథ ప్లాంట్ అధ్యక్షులు రాయల శ్రీను పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం మిషన్ భగీరథ ప్లాంట్‌లో ఆదివారం కార్మికుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన రాయల శ్రీను,కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.కార్మికుల సంక్షేమం,వేతనాల పెంపు,ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోగా,అధ్యక్షుడిగా రాయల శ్రీను,ఉపాధ్యక్షుడిగా గూడూరు మల్లేశం,ప్రధాన కార్యదర్శిగా సైదులు వెంకట్,కోశాధికారిగా సైదులు అనిల్,కార్యదర్శిగా కావళ్లి దయాకర్,స్టేట్ మీడియా అడ్వైజర్‌గా బాబోత్ నవీన్ ఎన్నికయ్యారు.వీరితో పాటు 30 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనును కమిటీ సభ్యులు అభినందించారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System