Type Here to Get Search Results !

ఓటరు నమోదుపై విస్తృత అవగాహన అవసరం:మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్.

NAMASTHE NEWS 0

ఓటరు నమోదుపై విస్తృత అవగాహన అవసరం.


మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్.




మరిపెడ/కురవి(జూన్ 14)నమస్తే న్యూస్.కురవి మండల కేంద్రంలో శనివారం ఓటరు నమోదుపై ప్రత్యేక అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ,ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఓటు హక్కుపై నిర్లక్ష్యం వహించకుండా,దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే విధానం, ఓటరు జాబితాలో తప్పుల సవరణ,చిరునామా మార్పు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సదస్సులో బజ్జురి పిచ్చిరెడ్డి,గుగులోతు రవినాయక్,సర్పంచ్ లక్ష్మీ రాజునాయక్,నూతక్కి సాంబశివ రావు, కొణతం విజయ్,సంగెం భరత్,వినోద్,శ్రీనివాస్,మాజీ సర్పంచ్ నారాయణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.నాయకులందరూ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమం చివరలో 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి పలువురు దరఖాస్తులు అందజేశారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System