Type Here to Get Search Results !

యువత సామాజిక బాధ్యత తీసుకోవాలి-సీఐ ఎల్.పవన్ కుమార్.

NAMASTHE NEWS 0

యువత సామాజిక బాధ్యత తీసుకోవాలి. 
సీఐ ఎల్.పవన్ కుమార్.




డోర్నకల్/మరిపెడ(జూన్ 17)నమస్తే న్యూస్.

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి శారీరక దారుఢ్యంతో పాటు మానసిక సమతుల్యత సాధించాలని,అదేవిధంగా సామాజిక బాధ్యత తీసుకుని సమాజంలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని మరిపెడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్.పవన్ కుమార్ సూచించారు.

బుధవారం మరిపెడ మున్సిపాలిటీలోని సన్ రైజర్స్ క్లబ్ సభ్యులకు నూతన జెర్సీలను ఆయన అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,"నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలి.గ్రామాల్లో గంజాయి విక్రయాలు,వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి,రూ.5,000 పారితోషికం అందిస్తాం.మీ సహకారంతోనే మరిపెడ మండలాన్ని గంజాయి రహిత మండలంగా మార్చగలం"అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా సన్ రైజర్స్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు.క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా గంట్ల మహిపాల్ రెడ్డి,ఉపాధ్యక్షుడిగా గంట్ల గౌతమ్ రెడ్డి,ప్రధాన సలహాదారులుగా మెరుగు రాము,సలహాదారులుగా ఎండి.రియాజ్ పాషా,బోడ లక్ష్మణ్,వ్యవస్థాపక అధ్యక్షులుగా గంట్ల ప్రదీప్ రెడ్డి,క్లబ్ అధ్యక్షుడిగా అర్కావత్ ప్రకాష్,ఉపాధ్యక్షుడిగా దస్రా,ప్రధాన కార్యదర్శిగా బి.వెంకన్న (డీజే),కోశాధికారిగా బి.నరేష్,సంయుక్త కార్యదర్శిగా బోడ రవి,కార్యదర్శులుగా వెంకటేష్,బోడ శ్రీనులను ఎన్నుకున్నారు.నూతన కమిటీకి సీఐ,ఎస్ఐలు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ,మున్సిపల్ కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటే తమ క్లబ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌కే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్ రెడ్డి,రవి,ఉపేందర్,కాంగ్రెస్ నాయకులు షేక్ యాకుబ్ పాషా పాల్గొని క్రీడాకారులకు ప్రోత్సాహకంగా డే అండ్ నైట్ బంతుల కిట్‌ను అందించారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System