Type Here to Get Search Results !

అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.

NAMASTHE NEWS 0

అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.
ఇద్దరు నిందితులని అరెస్టు చేసిన పోలీసులు.

నిందితుల అరెస్టు చూపుతున్న నర్సింహులపేట పోలీసులు 


నర్సింహులపేట, జూన్ 18(నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని లోక్య తండా శివారులో అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లోక్య తండా గ్రామ శివారులో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (నంబర్: TS 12 UD 2028)ను తనిఖీ చేయగా, అందులో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 75 బస్తాల పీడీఎస్ బియ్యం (ప్రతి బస్తా 50 కిలోలు) ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 35 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది.దర్యాప్తులో భాగంగా గోల్‌బొడ్క తండాకు చెందిన కాశం భద్రయ్య (60) అనే వ్యక్తి, దన్‌సింగ్ తండా గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బాధవత్ ప్రమీల భర్త శంకర్ వద్ద నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి నకిరేకల్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో వాహన డ్రైవర్ ఎండీ గౌస్, వాహన యజమాని గుజ్జ భాస్కర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు.ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుళ్లు ప్రవీణ్, మహేష్ పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం మరియు వాహనాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System