Type Here to Get Search Results !

ఏసీబీ వలలో చిక్కిన అధికారులు.. సంబరాలు జరుపుకున్న ప్రజలు.

NAMASTHE NEWS 0

  • ఎంపీడీవో ఏసీబీకి చిక్కడంతో టపాకాయలు కాల్చిన స్థానికులు.





నర్సింహులపేట, జూన్ 12 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఎంపీడీవో రాధిక ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం వెలుగులోకి రావడంతో కొందరు స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ ఘటన మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.ఎంపీడీవోపై ఏసీబీ చర్యల విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకోగా, మరికొందరు అవినీతిపై చర్యలు తీసుకోవడాన్ని స్వాగతించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెరగాలని, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System