Type Here to Get Search Results !

మరిపెడ పట్టణంలో 4-5 వార్డులో పారిశుధ్య పనుల పరిశీలన

NAMASTHE NEWS 0

  • మరిపెడ పట్టణంలో 4-5 వార్డులో పారిశుధ్య పనుల పరిశీలన. 
  • కమిషనర్‌తో కలిసి పర్యటించిన కాంగ్రెస్ నేత శ్రీపాల్ రెడ్డి.




డోర్నకల్/మరిపెడ(జూన్ 12)నమస్తే న్యూస్.

పట్టణంలోని 4,5 వ వార్డుల్లో చేపట్టాల్సిన పారిశుధ్య పనులు,సైడ్ డ్రైనేజీ నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. 5వ వార్డులో పారిశుధ్య సమస్యలు,డ్రైనేజీ నిర్మాణ అవసరాలను,4వ వార్డులో సైడ్ డ్రైనేజీలతో పాటు స్థానిక ఆడిటోరియంలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్,4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము,వార్డు ఆఫీసర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System