Type Here to Get Search Results !

మానవ హక్కులను ప్రతి ఒక్కరు కాపాడాలి .

NAMASTHE NEWS 0

మానవ హక్కులను ప్రతి ఒక్కరు కాపాడాలి .


హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు హుస్సేన్.


మండలం కమిటీ సభ్యులకూ నియామక పత్రాలు అందజేసిన జిల్లా జాయింట్ సెక్రెటరీ అల్లం చంద్రశేఖర్.



మహబూబాబాద్, మే 08 (నమస్తే న్యూస్):

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాలని హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా, మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ సెక్రటరీగా అల్లం చంద్రశేఖర్, దంతాలపల్లి మండల అధ్యక్షుడిగా కళ్యాణి సాయికృష్ణ, వైస్ ప్రెసిడెంట్‌గా అల్లం ప్రకాష్, జనరల్ సెక్రటరీగా నరుకుటి వేణుగోపాల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా టేకు ఉమేష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ మహిళల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, వినియోగదారుల హక్కులు, సమాచార హక్కు, విద్య హక్కు చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. అనంతరం చంద్రశేఖర్, ప్రకాష్, సాయికృష్ణలు తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నరుకుటి రామారాజు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System