Type Here to Get Search Results !

కేంద్ర సహాయ మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు?.... తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం..!

NAMASTHE NEWS 0

కేంద్ర సహాయ మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు?


తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం..! 




(నమస్తే న్యూస్ డెస్క్, మే 09 హైదరాబాద్)

బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరధ్‌పై పోక్సో కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. బాధితురాలు మైనర్ బాలిక అని, ఆమెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఫిర్యాదు ప్రకారం మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం కారణంగా తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడిందని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నుంచి బయటపడేందుకు తమ కుమార్తెపైనే తప్పుడు ఆరోపణలు, కౌంటర్ కేసులు నమోదు చేయిస్తున్నారని వారు మీడియా ముందు ఆరోపించారు.ఇక మరోవైపు బండి సంజయ్ కుమార్ వర్గం మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ఇది రాజకీయ ప్రేరేపిత హనీ ట్రాప్ వ్యవహారమని, తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రూ.5 కోట్ల డిమాండ్ చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.50 వేల రూపాయలు ఇచ్చిన విషయాన్ని కూడా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే “ఏ తప్పూ చేయనప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చారు?” అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

ఈ కేసు ఇప్పుడు రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా సంచలనంగా మారింది. ముఖ్యంగా మైనర్ బాలికకు సంబంధించిన ఆరోపణలు ఉండటంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలు, ప్రతిఆరోపణల మధ్య నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System