Type Here to Get Search Results !

సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి :ప్రజానాట్యమండలి మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సైదులు

NAMASTHE NEWS 0


(నమస్తే న్యూస్,మహబూబాబాద్,03)

మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజానాట్యమండలి మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సైదులు ప్రజలను కోరారు.సోమవారం నాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెనుమల్ల జగన్నాథ భవన్లో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం చింతల ఎల్లయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సైదులు పాల్గొని మాట్లాడుతూ మహబూబాబాద్ ఎన్నికల్లో సిపిఎం తరపున పోటీ చేసిన అభ్యర్థులను ఓట్లు వేసి అధిక సంఖ్యలో గెలిపిస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు నిరంతరం ప్రజల కోసం పనిచేసే సిపిఎం పార్టీని ఆదరించాలని అన్నారు మహబూబాబాద్ అభివృద్ధి విషయంలో సిపిఎం ఎంతో కృషి చేసింది డ్రైనేజీలు వీధిలైట్లు వాణిజ్యపరంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని అనేకసార్లు ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన చరిత్ర సిపిఎం ది ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ప్రజాతంత్ర వాదులు మేధావులు అధిక సంఖ్యలో సిపిఎంకు మద్దతు ఇచ్చి సుత్తి కొడవ నక్షత్రం గుర్తుపైన అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాము ఈ సమావేశంలో కళాకారులు మచ్చ వెంకన్న మన్యం మల్లేష్ వీరన్న కొమరంభాగ్య మహంకాళి హరిత ఎస్ కే జహీర్ ఖాన్ ఎల్లయ్య ఎల్లమ్మ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System