Type Here to Get Search Results !

గ్రామ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే దాడి?

NAMASTHE NEWS 0

  • గ్రామ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే దాడి?
  • గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే రాజకీయంలోకి వచ్చాను.
  • మరిపెడ మండలం గిరిపురం గ్రామ వార్డ్ మెంబర్ ఆవేదన.



డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 04(నమస్తే న్యూస్).  

గ్రామ అభివృద్ధిలో భాగం కావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను.కానీ అవినీతిని ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీ 7వ వార్డ్ మెంబర్ బాధవత్ జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు.గిరిపురం గ్రామపంచాయతీలో జరుగుతున్న అవినీతిపై గ్రామసభలో ప్రశ్నించినందుకు తనపై భౌతిక దాడికి దిగారని ఆయన ఆరోపించారు.గ్రామసభ జరుగుతుండగా అందరి సమక్షంలోనే తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.గత ఆరు నెలల వ్యవధిలోనే గ్రామపంచాయతీ కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారని,అందులో కేవలం రెండు నెలల్లోనే బ్లీచింగ్ పౌడర్ కోసం 80 వేల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని జనార్దన్ పేర్కొన్నారు.నిజాయితీగా పనిచేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం.చదువుకుని ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను.కానీ ప్రజాధనం దుర్వినియోగంపై ప్రశ్నిస్తే ఇలా దాడులకు దిగడం దారుణమని ఆయన అన్నారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డ్ మెంబర్ జనార్దన్ డిమాండ్ చేశారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System