Type Here to Get Search Results !

మాజీ పాత్రికేయుడు అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయుల బృందం.

NAMASTHE NEWS 0


మాజీ పాత్రికేయుడు అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయుల బృందం.




కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ,ఆగస్టు5(నమస్తే న్యూస్)

రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం.డి.అబ్దుల్ ఖాదర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను బుధవారం పాత్రికేయుల బృందం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపింది. దశాబ్ద కాలం పాటు పాత్రికేయ వృత్తిలో సేవలందించి, ప్రస్తుతం డోర్నకల్ మండలం చిలుకోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాజీ పాత్రికేయుడు ఎం.డి. అబ్దుల్ అజీజ్, అలాగే సీపీఐ జిల్లా సమితి సభ్యుడు అబ్దుల్ రషీద్‌లను వారి నివాసంలో కలిసి వారికి,వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ, అబ్దుల్ ఖాదర్ ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిద్దారని, సామాజిక స్పృహ కలిగిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన విలువలు, సేవాభావం కుమారులలో ప్రతిఫలించడం వారి పెంపకానికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం దివంగత అబ్దుల్ ఖాదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తార్, రియాజ్, అక్తర్ పాషా, వేణు, అనంతరాములు, రాజేష్, సంజీవ్, నాగేంద్ర, విష్ణు, సీఐటీయూ మండల కన్వీనర్ దుండి వీరన్న, నాయకులు కొండ వెంకన్న, భూష్పాక మైసయ్య, గోపి రమేష్ తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System