Type Here to Get Search Results !

పంటల వైవిధ్యీకరణతో రైతుల్లో మార్పు

NAMASTHE NEWS 0

 

పంటల వైవిధ్యీకరణతో రైతుల్లో మార్పు

వాణిజ్య, అంతర పంటల సాగుతో ఆదాయం పెంచుకోవాలి: ఏడీఏ శ్రీనివాసరావు



రిపోర్టర్: పిల్లల నరసింహారావు

బయ్యారం, ఆగస్టు 4 (నమస్తే న్యూస్) 

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో రైతులు పంటల వైవిధ్యీకరణ వైపు ఆసక్తి చూపుతున్నారని మహబూబాబాద్ వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ఎ. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన క్షేత్రస్థాయిలో సాగుతున్న వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కొత్తపేట, అల్లిగూడెం, కంబాలపల్లి గ్రామాల్లోని ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి, రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, మెరుగైన సేవలు అందించాలని డీలర్లకు సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాల ప్రభావాన్ని పరిశీలించిన ఆయన, గ్రామాల్లో రైతుల సాగు విధానంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అల్లిగూడెం గ్రామంలో ఇటీవల నాటిన ఆయిల్‌పామ్ తోటల్లో పత్తి, మొక్కజొన్నను అంతర పంటలుగా సాగు చేస్తున్న రైతులను అభినందించారు.అదేవిధంగా ఒక రైతు ఒక ఎకరంలో బోడ కాకర (స్పైన్ గోర్డ్) వాణిజ్య పంటను విజయవంతంగా సాగు చేస్తున్న తోటను సందర్శించి సాగు విధానం, దిగుబడుల వివరాలను తెలుసుకున్నారు.నారాయణపురం గ్రామంలో నువ్వులు, పత్తి–కంది, కంది–నువ్వులు అంతర పంటల సాగును పరిశీలించిన ఏడీఏ, రైతులు ఆదాయాన్ని పెంచే విధంగా పంటల వైవిధ్యీకరణను అవలంబించడం అభినందనీయమని అన్నారు.సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య, ఉద్యాన, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో బయ్యారం మండల వ్యవసాయ అధికారి రాజు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System