Type Here to Get Search Results !

పల్లెల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి:ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్

NAMASTHE NEWS 0

  • పల్లెల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.
  • అధికారులు పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా  పనిచేయాలి.
  • ప్రజా సమస్యల పరిష్కారమే జనరల్ బాడీ సమావేశం లక్ష్యం.
  • ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్


జనరల్ బాడీ సమావేశానికి హాజరైన అధికారులు ప్రజాప్రతినిధులు


నర్సింహులపేట,ఆగస్టు 5 (నమస్తే న్యూస్)

పల్లెల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అధికారులను ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై శాఖల వారీగా సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని, అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.ఈ సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System