Type Here to Get Search Results !

పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‌ మెంట్ వెంటనే విడుదల చేయాలి.

NAMASTHE NEWS 0

పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‌ మెంట్ వెంటనే విడుదల చేయాలి.

ఆగస్టు 6న ఇందిరాపార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ మహా ధర్నా.

జిల్లా కార్యదర్శి పట్ల మధు పిలుపు.

కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ:ఆగస్టు 05,(నమస్తే న్యూస్).




రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 8000 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు.బుధవారం మరిపెడ మండలంలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ రేపు అనగా ఆగస్టు 6న ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్,డిగ్రీ విద్యార్థులు తరలివస్తున్నారని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడిచినా ఇప్పటివరకు విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేని పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు.పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో:ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కార్యదర్శి పెద్దపులి బాసు,మండల నాయకులు అనిల్,చందు,మహేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System