మరిపెడ మండలంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.
డోర్నకల్ ఎమ్మెల్యే-డాక్టర్ రామ చంద్రు నాయక్ సహాకారంతో.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ రవి నాయక్.
డోర్నకల్/మరిపెడ/ఆగస్టు 03,(నమస్తే న్యూస్)
మరిపెడ మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సి ఎం ఆర్ ఎఫ్)కింద మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ రవి నాయక్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కూన్య తండాకు చెందిన ప్రమాదంలో గాయపడిన చిన్నారి బానోతు భవితకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1,20,000(ఒక లక్ష ఇరవై వేల రూపాయల)విలువైన చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా గుగులోత్ రవి నాయక్ మాట్లాడుతూ,ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎలమంచిలి తండా సర్పంచ్ బానోత్ భద్రు నాయక్ పాల్గొన్నారు.

