Type Here to Get Search Results !

ఎస్‌ఐఆర్ ఓటర్ల ముసాయిదా ప్రక్రియపై అవగాహన కార్యక్రమం.

NAMASTHE NEWS 0

ఎస్‌ఐఆర్ ఓటర్ల ముసాయిదా ప్రక్రియపై అవగాహన కార్యక్రమం.




తొర్రూరు,జూలై 13(నమస్తే న్యూస్) 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో తహసీల్దార్ గడిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ఓటర్ల ముసాయిదా ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ గడిల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామి కావాలని సూచించారు. మున్సిపాలిటీ కేంద్రంలో బీఎల్ఓలు, సూపర్‌వైజర్లు, సహాయక సిబ్బంది అందుబాటులో ఉండి ఓటర్ల ఫారాలను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎస్‌ఐఆర్ ఫారాలను జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 20 మంది బీఎల్ఓలు, 15 మంది సూపర్‌వైజర్లు, 35 మంది సహాయక సిబ్బంది పాల్గొని ఓటర్లకు అవసరమైన సూచనలు, సహాయ సహకారాలు అందించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System