Type Here to Get Search Results !

సంత బజారులో ప్రజానీకానికి ఆటంకం కలిగించవద్దు:మున్సిపల్ చైర్ పర్సన్ ప్రఘతి శ్రీపాల్ రెడ్డి

NAMASTHE NEWS 0

సంత బజారులో ప్రజానీకానికి ఆటంకం కలిగించవద్దు.
మున్సిపల్ చైర్ పర్సన్ ప్రఘతి శ్రీపాల్ రెడ్డి.




డోర్నకల్/మరిపెడ(జులై 03)నమస్తే న్యూస్.మరిపెడ పట్టణ సంత చిరు వ్యాపారలతో మున్సిపల్ చైర్ పర్సన్ సమావేశమై,ప్రజల రాక పోకలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని,సంత బజారులో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నందున,కార్యాలయాలకు వచ్చే వాహనాలకు,ప్రజలకు దారి ఇచ్చి వ్యాపారాలు చేసుకోవాలని తెలియచేశారు.సంత వ్యాపారులను పిలిచి హెచ్చరికలు జారీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్.మరిపెడ పట్టణంలోని సంత బజారు కూరగాయలు,నాలుగు చక్రాలా తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డితో కలిసి వ్యాపారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ,సంత బజారులో వ్యాపారులు రోడ్డును ఆక్రమించి బండ్లు,తట్టలు పెట్టడం వల్ల వాహనదారులకు,ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై రోడ్డుపై ఆక్రమణలు చేస్తే సహించేది లేదని,వెంటనే తొలగించాలని గట్టిగా హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన చోటులోనే వ్యాపారం చేయాలని,చెత్త చెదారం రోడ్డుపై పడవేయవద్దని,పరిశుభ్రత పాటించాలని కోరారు.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు విధిస్తామని,చెప్పినప్పటికి పదేపదే తప్పులు చేస్తే దుకాణాల నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని  తేల్చిచెప్పారు.ప్రజలకు ఆటంకం లేకుండా వ్యాపారం చేస్తే మున్సిపల్ శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని,లేదంటే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులకు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సంత బజారు కూరగాయల వ్యాపారులు,చిరు వ్యాపారులు,నాలుగు చక్రాలా తోపుడు బండి చిరు వ్యాపారులు హాజరయ్యారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System