Type Here to Get Search Results !

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు:సర్పంచ్ మాలోత్ బాలు నాయక్

NAMASTHE NEWS 0

వంతడుపుల గ్రామంలో చేతిపంపు మరమ్మతులు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు:
సర్పంచ్ మాలోత్ బాలు నాయక్



నర్సింహులపేట, జూలై 8 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ పర్యవేక్షణలో చేతిపంపుకు మరమ్మతులు చేపట్టారు. చేతిపంపు పనిచేయక స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి, బోరింగ్ మెకానిక్‌తో మరమ్మతు పనులు చేపట్టించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాల సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించి వంతడుపుల గ్రామాన్ని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన కోరారు.సమస్యను వెంటనే పరిష్కరించడంలో సహకరించిన బోరింగ్ మెకానిక్ ఎర్ర నరసయ్యకు సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ తక్షణ స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System