Type Here to Get Search Results !

మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా మాల మహానాడు నాయకులు.

NAMASTHE NEWS 0

మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా మాల మహానాడు నాయకులు.



తిరుమలాయపాలెం ,జూలై 12 (నమస్తే న్యూస్)

ఖమ్మం జిల్లా మాల మహానాడు నాయకులు తెలంగాణ రాష్ట్ర గనులు, పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ డా. గడ్డం వివేక్ వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమలు మరియు రోస్టర్ పాయింట్ సిస్టమ్‌లో అవసరమైన సవరణలు చేపట్టాల్సిన అవసరాన్ని మంత్రి కి మౌఖికంగా వివరించారు. 

9% శాతం ఉన్నవారికి రోస్టర్ లో రెండవ పాయింట్ 16వ పాయింట్ ఉన్నప్పుడు 1% ఉన్నవారికి ఏడవ రోస్టర్ పాయింట్ ఉన్నప్పుడు 5% ఉన్నవారికి పదిలోపు రోస్టర్ పాయింట్ కేటాయించాలని తెలియజేయడం జరిగింది. SC గ్రూప్ త్రీ వారికి 22వ రోస్టర్ పాయింట్ ఉండడం వలన గత 16 నోటిఫికేషన్ లలో కూడా ఒక్క ఉద్యోగం కూడా కేటాయించబడలేదని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రోస్టర్ పాయింట్ విధానంలో ఉన్న సమస్యలను సరిదిద్ది అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు నాయకులు ప్రస్తావించిన అంశాలను శ్రద్ధగా విని, వాటిని పరిశీలించి సంబంధిత స్థాయిలో చర్చించి తగిన చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మాల మహానాడు నాయకులు గుంతేటి వీరభద్రం, పల్లా రాజశేఖర్, ఉద్యోగ సంఘ నాయకులు పెరుమాళ్లపల్లి శ్రీనివాస్, జంగం లక్ష్మణ్ రావు, గుడిపూడి కృష్ణయ్య, కె .రామారావు,మాల మహానాడు నాయకులు దాసరి శ్రీనివాస్, కొరివి దయానంద్, పాగా యోనా, కామా ప్రభాకర్, కరాటే వేణు, కొప్పుల రామారావు, బిందె రమేష్, న్యాయవాదులు రెంటాల ఆనంద్, మర్రి ప్రకాష్,గోసోజు క్రిస్టపర్, తోగరు భాస్కర్, ఉల్లోజు రమేష్,జగన్, చింతపల్లి వెంకన్న, జమ్మి వీరబాబు,రవి, గొట్టిముక్కల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System