Type Here to Get Search Results !

గ్రామంలో పారిశుధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సర్పంచ్ అనపర్తి రవి

NAMASTHE NEWS 0


జల్లేపల్లి  గ్రామంలోని పరిశుద్ధ పనులు....పర్యవేక్షించిన
పంచాయతీ సెక్రటరీ అబ్దుల్ రహీం.




మండల రిపోర్టర్: దామల్ల భాస్కర్ 

తిరుమలయపాలెం,జూలై23 (నమస్తే న్యూస్)

తిరుమలయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో వీధులలో, సైడ్ డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ వేయించడం జరిగింది. గ్రామంలోని వీధులలో ఉన్న బురద గుంటలలో, సైడ్ కాల్వాలల్లో బ్లీచింగ్ చల్లడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ అన్నపర్తి రవి మాట్లాడుతూ ప్రజలందరూ వర్షాకాలం మొదలైంది. కనుక ఇండ్లలోని పాత టైర్లు, కొబ్బరి బోండాలు, రోలు, వాడని గాబులు లలో నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. వీటిల్లో నీరు నిల్వ ఉంటే డెంగ్యూ దోమలు తయారై కుట్టడం వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, విష జ్వరాలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలని జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ రహీం మాట్లాడుతూ ప్రజలందరూ ఇండ్లలోని వాడుకున్న వాటర్ ని ఇంకుడు గుంటలోకి వెళ్లే లాగా చూసుకోవాలన్నారు. నీటిని నిల్వ ఉంచడం వల్ల బురదలో ఈగలు దోమలు తయారై దుర్వాసనతో  ఇబ్బంది కలిగిస్తాయి. కనుక ప్రజలు ఇండ్లను, వీధులను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు పోట్ల కిరణ్ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది, ట్రాక్టర్ డ్రైవర్ మల్సూర్, దండాల లచ్చయ్య, చిప్పరపల్లి రమేష్, వార్డ్ మెంబర్ తేజవత్ ఉపేందర్, మనసూరు, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System