Type Here to Get Search Results !

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?..నీట్ పేపర్ లీక్‌పై నర్సింహులపేటలో ఆగ్రహ జ్వాలలు.

NAMASTHE NEWS 0

  • నీట్ లీక్‌కు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం.
  • నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై నర్సింహులపేటలో నిరసన.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.
  • నీట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.




రిపోర్టర్:చెలిమల్ల గణేష్ 

సెంటర్:నర్సింహులపేట

నర్సింహులపేట,జూలై 24 (నమస్తే న్యూస్) 

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్, కాంగ్రెస్, కేవీపీఎస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు సంయుక్త ఆధ్వర్యంలో ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ యువత భవిష్యత్తుతో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్, బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు బండి రమేష్, కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్ అలివాల శ్రీనివాస్, కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు చిర్ర సతీష్, యూత్ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ యాదవ్, ధోనికేనా ఉపేందర్, జంపాల శ్రీకాంత్తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, కేవీపీఎస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System