Type Here to Get Search Results !

వివాదాల సుడిలో,మాకుల దేవాలయం....భక్తుల విరాళాల లెక్కలు బయటపెట్టాలి.

NAMASTHE NEWS 0

  • వివాదాల సుడిలో,మాకుల దేవాలయం.
  • భక్తుల విరాళాల లెక్కలు బయటపెట్టాలి. 
  • మాకుల క్షేత్ర నిర్వహణలో అవినీతి.
  • అర్చకులను తొలగించాలని డిమాండు.
  • లంబాడీల ఐక్య వేదిక రాష్ట సమన్వయ కర్త రమేష్ జాదవ్.
కారంపురి వెంకటేశ్వర్లు నేత.

డోర్నకల్/మరిపెడ,జూలై 28(నమస్తే న్యూస్)




నిత్యం వివాదాలకు నిలయంగా మారుతున్న మాకుల క్షేత్రంపై లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మ్యారమా భవానీ ఆలయంలో ప్రభుత్వ నిధులు కాకుండా భక్తుల దగ్గర వసూలు చేసిన విరాళాల లెక్కలు ఇప్పటికీ ప్రకటించలేదని ఆరోపించారు.రెండు సంవత్సరాలు దాటినా లెక్కలు చెప్పని ఆలయ అధికారులు తక్షణమే ఆలయ భూమి ఇచ్చిన వారి పేర్లు,భక్తుల నుండి తీసుకున్న విరాళాల లెక్కలను ప్రకటించి,వాటిని శిల ఫలకాలపై చెక్కించాలని డిమాండు చేశారు.

ఆలయ అధికారికి తెలియకుండా,ఎలాంటి రసీదు ఇవ్వకుండా లక్షల రూపాయలు వసూలు చేసిన అర్చకులను విధుల నుండి తొలగించాలని కోరారు.

అర్చకుల మధ్య జరిగిన గొడవ,ఒక అర్చకుడు మరొక అర్చకుడిపై దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలిపారు.గాయత్రిని గుంజి వేసి కుంకుమపై చల్లిన సంఘటన కూడా జరిగిందని చెప్పారు.

వీరికి క్షేత్రంపై ప్రేమ లేదు.కేవలం భక్తుల దగ్గర వచ్చే డబ్బులపైనే మోజు ఉంది.భక్తుల చేత హుండీలో కాకుండా పళ్లెంలో డబ్బులు వేయించుకుని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.వీరికి అండగా ఉన్న ముఠా ఆగడాలను అడ్డుకోవాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

అర్చకుల తీరుతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారని,సుప్రసిద్ధ మాకుల భావసింగ్ మహారాజ్ మ్యారమా భవానీ ఆలయ క్షేత్రం అర్చకుల తీరుతో చెడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజన లంబాడీలకు ఆరాధ్య దైవంగా ఉన్న మాకుల భావసింగ్ బాబా,మ్యారమా భవానీ ఆలయం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేక నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని అన్నారు.ముఠా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆరోపించారు.

ఇప్పటికే ఆలయం సమీపంలో మాజీ పార్లమెంటు సభ్యుడు,మాజీ శాసన సభ్యుడు సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయానికి ఇచ్చిన మూడు ఎకరాల భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన,ఆలయ అధికారిగా పని చేసిన భిక్షం చారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.అటువంటి వ్యక్తి ఇప్పటికీ ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని,ఇటీవల జరిగిన ఆలయ వేలం పాటలో గ్రామ పెద్దలు ఈ విషయాన్ని ఆరోపించారని తెలిపారు.ఈ విధంగా నిత్యం వివాదాల మధ్య ఆలయ నిర్వహణ గందరగోళంగా మారిందని,భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యమ నాయకులకు ఫోన్లలో ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు.ఇదిలా ఉండగా ఆదివారం ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుని బావమరిదిపై భౌతిక దాడి జరిగినట్లు కెమెరాల్లో నమోదైందని తెలిపారు.ఆలయంలో జరుగుతున్న అవినీతి,వివాదాలు బయటకు రాకుండా అర్చకులు ఒక ముఠాను పెంచి పోషిస్తున్నారని జాదవ్ రమేష్ నాయక్ ఆరోపించారు.  






 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System