Type Here to Get Search Results !

కళామతల్లి ముద్దుబిడ్డ నిరక్షరాస్యుడైన... పుడమి ఒడిలో పుట్టిన పాటల పూదోట.

NAMASTHE NEWS 0

కళామ తల్లి ముద్దు బిడ్డ..కూరగాయల వెంకన్న.
నిరక్షరాస్యుడైనా...పుడమి ఒడిలో పుట్టిన పాటల పూదోట.



తిరుమలాయపాలెం,జూలై 22 (నమస్తే న్యూస్)

పిండిప్రోలు...పూరి గుడిసెలో పుట్టి... ప్రజల గుండెల్లో గోంగూర వెంకన్న గా నిలిచిన ప్రజాకవి తిరుమలాయపాలెం మండలం అంటే గుర్తొచ్చే ప్రజా కళాకారుల్లో గోంగూర వెంకన్న  పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. చదువులు లేవు,పాఠశాలలో పెద్దగా చదవక పోయినా, జీవితాన్నే గురువుగా చేసుకున్న ఆయన పాటలు మాత్రం వేలాది మందిని ఆలోచింపజేశాయి. పొట్టకొస్తే కోస్తే అక్షరం రాకపోయినా, గుండె కోస్తే గేయాలు ప్రవహించే కళాకారుడిగా వెంకన్న  ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం లోని పిండిప్రోలు గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించిన వెంకన్న  చిన్ననాటి నుంచే కష్టాల మధ్య పెరిగారు. పూరి గుడిసెలో పుట్టినా, ప్రజల బాధలను తన బాధగా భావించారు. కమ్యూనిస్టు భావజాలం ప్రభావంతో సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుని, పాటనే తన ఆయుధంగా ఎంచుకున్నారు.

 రైతు కూలీగా ప్రజలకు దగ్గర....ప్రజల జీవితాలను దగ్గరగా చూసిన వెంకన్న, రైతు కష్టాలు, కూలీల బతుకులు, ఆరోగ్య సమస్యలు, సామాజిక అన్యాయాలు, మానవత్వం, ప్రజా పోరాటాలు వంటి అంశాలపై వందలాది పాటలను ఆలపించారు.  ఉద్యమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆయన గొంతు వినిపించేది. 

ఆయన పాటే ఒక సందేశం...ఆయన పాటల్లో సందేశం ఉండేది మాటల్లో మానవత్వం ఉండేది.

ఒక సాధారణ కళాకారుడిగా కాకుండా, ప్రజల మధ్య తిరుగుతూ అవగాహన కల్పించిన ప్రజా గాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఎలాంటి వేదిక అయినా, ఎలాంటి పరిస్థితి అయినా తన పాటతో ప్రజలను చైతన్యపరచడం వెంకన్న ప్రత్యేకత.


ఆరెంపల  వెంకన్న కాస్త గోంగూర వెంకన్న గా...

గోంగూర వెంకన్న అనే పేరుకు కథ వెంకన్న అసలు పేరు కంటే "గోంగూర వెంకన్న " అనే పేరే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. గోంగూరలాగే ఆయన పాటల్లో పులుపు, పదును, నిజాయితీ కలిసి ఉండేవి. సామాజిక సమస్యలను గోంగూర రుచిలా నేరుగా ప్రజల ముందుంచే ఆయన శైలి వల్లే ఆ పేరు ప్రజల నోట నానింది. ఆ పేరే ఇప్పుడు ఆయనకు చిరునామాగా మారింది.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా...

పురస్కారాల కోసం పరుగులు లేవు... కానీ ప్రజల ప్రేమే ఆయనకు అతిపెద్ద గౌరవం. కళను ప్రజల కోసం వినియోగించిన అరుదైన ప్రజా కళాకారుడిగా గోంగూర వెంకన్న తిరుమలాయపాలెం ప్రాంత ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System