కాల్వ ఒడ్డు ఎస్సీ ఎస్టీ బీసీ షాపింగ్ కాంప్లెక్స్ ను తొలగిస్తే ప్రత్యామ్నాయం చూపాలి.
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 29 (నమస్తే న్యూస్ )
కాల్వ ఒడ్డు ఎస్సీ కాంప్లెక్స్ ను కేబుల్ బ్రిడ్జి ను ద్రుష్టిలో ఉంచు కొని రోడ్ వెడల్పులో భాగం గా కూల్చి వేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ వారు నోటీస్ లు ఇచ్చారు. తిరిగి మున్సిపాలిటీ వారు కట్టించి మళ్ళీ మీకే ఇస్తామన్నారు. ఈ విషయమై కలెక్టర్ కి, ఈ.డి కి తెలుపుకున్నాము అందుకు సంబంధించి హామీగా ఎటువంటి ఆర్డర్ కాఫీ ఇవ్వలేదు. ఈ విషము కాల్వోడ్డు కాంప్లెక్స్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులు ప్రెస్ మీట్ ద్వారా తమ బాధను తెలియజేసు కున్నారు ఒక వేళ కూల్చి కట్టించిన పక్షంలో కింద షాప్ లలో మా షాప్ లకు మాకే ఇవ్వాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ గౌరవ అధ్యక్షులు గుంటేటి వీరభద్రయ్య మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ లో 62 మంది చిరు వ్యాపారస్తులు పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ తరుణంలో 1984లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారి ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అధికారి నిరుద్యోగులైన వారికి జీవన భృతి కొరకు ప్రభుత్వ స్థలములో పది ఎనిమిది కొలతలతో షాపులు నిర్మించి నిరుపేదలైన అణగారిన కులాలకు షాపులు కేటాయించడం జరిగింది. ఇది సెల్ఫీ ఎంప్లాయిమెంట్ స్కీం లో భాగంగా కొందరికి ఆటోలు, కారులు, ఇంటి జాగలు, వ్యవసాయ భూముల తోపాటు నిరుపేదల కొరకు షాపులు కేటాయించడం జరిగింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని నిరుపేద దుకాణదారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించి ఆదుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోగరు భాస్కర్, దేవపంగు సుదర్శన్, దాసరి శ్రీను, చెరుకుపల్లి నాగేశ్వరరావు, తగరం సుగుణమ్మ, కరిశే కమల, జిల్లపల్లి సుజాత, తెల్లూరి భాస్కర్, అర్చన జయమ్మ , లంబాడీ హక్కుల రాష్ట్ర నాయకులు భద్రు నాయక్ దళిత నాయకులు పాల్గొన్నారు.

