Type Here to Get Search Results !

బచ్చోడు తండాలో డెంగ్యూ కలకలం.

NAMASTHE NEWS 0

బచ్చోడు తండాలో డెంగ్యూ కలకలం..!
రెండు రోజుల్లో రెండు కేసులు నమోదు..
అప్రమత్తమైన గ్రామపంచాయతీ, వైద్య సిబ్బంది



రిపోర్టర్ :దామల్ల భాస్కర్ 

తిరుమలాయపాలెం,జూలై 31 (నమస్తే న్యూస్ )

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు తండా గ్రామపంచాయతీలో డెంగ్యూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు రోజుల క్రితం ఒక డెంగ్యూ కేసు నమోదు కాగా, ఈరోజు గ్రామంలో నిర్వహించిన రక్త నమూనాల సేకరణలో మరో డెంగ్యూ కేసు వెలుగులోకి వచ్చింది.దీంతో గ్రామపంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు, హెల్త్ వర్కర్లు వెంటనే అప్రమత్తమై గ్రామంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించడం, రక్త నమూనాలు తీసుకోవడం, దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.డెంగ్యూ వ్యాప్తి చెందకుండా గ్రామస్థులు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను తొలగించాలని, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు."పరిశుభ్రమైన పరిసరాలే డెంగ్యూకు శాశ్వత నివారణ" అని ఆరోగ్య శాఖ అధికారులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశార.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System