Type Here to Get Search Results !

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన సర్పంచ్ బాలునాయక్.

NAMASTHE NEWS 0

అంగన్వాడిలో ఘనంగా అక్షరాభ్యాసం.
సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం.

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న సర్పంచ్ బాలు నాయక్

నర్సింహులపేట, జూలై 1(నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామ అంగన్వాడి కేంద్రంలో బుధవారం అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారుల జీవితంలో అక్షరాభ్యాసం ఒక మధురమైన, కీలకమైన ఘట్టమని అన్నారు. బాల్యంలోనే విద్యపై ఆసక్తి పెంపొందేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ప్రాథమిక విద్యా సదుపాయాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గౌస్ పాషా, పంచాయతీ సెక్రటరీ ఉమారాణి, అంగన్వాడి సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System