Type Here to Get Search Results !

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరం:సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్

NAMASTHE NEWS 0

దొనకొండలో ఉచిత వైద్య శిబిరం.




దంతాలపల్లి, జూలై 4 (నమస్తే న్యూస్):

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్ అన్నారు.దంతాలపల్లి  మండలంలోని దొనకొండ గ్రామంలో బాలవికాస్ సహకారంతో తొర్రూరు మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్ యాదవ్ శిబిరాన్ని ప్రారంభించారు.శిబిరంలో గ్రామానికి చెందిన మహిళలు, వృద్ధులు, యువతతో పాటు పలువురు ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన బాలవికాస్ సంస్థ, మెడికేర్ హాస్పిటల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు గ్రామపంచాయతీ తరఫున ఎల్లప్పుడూ కృషి చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System