Type Here to Get Search Results !

ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్.

NAMASTHE NEWS 0

  • ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్.


డోర్నకల్/మరిపెడ(జులై 10)నమస్తే న్యూస్.మరిపెడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరుగుతున్న ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల నింపే ప్రక్రియ (సర్)ను డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రు నాయక్ పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన(సర్)ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బూత్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని,ఎటువంటి పొరపాట్లు లేకుండా ఫారాలు నింపాలని ఆదేశించారు. డోర్నకల్ నియోజకవర్గ(సర్)ఇంచార్జీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి, గుగులోత్ రవి నాయక్, కౌన్సిలర్ మెరుగు రాము, టౌన్ అధ్యక్షులు షేక్ తాజోద్దీన్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, కొంపెల్లి సురేందర్ రెడ్డి, గుండగాని వెంకన్న, కారంపూడి ఉపేంధర్, బంక ప్రమోద్, మహేందర్, సలీం, అక్బర్, లక్ష్మణ్, గుంటి రవి, పర్వీన్, చీనా, గండి రమేష్ తో పాటు వివిధ బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System