Type Here to Get Search Results !

కామ్రేడ్ అరుణోదయ నాగన్న కన్నుమూత...విప్లవ లోకానికి తీరని లోటు.

NAMASTHE NEWS 0

కామ్రేడ్ అరుణోదయ నాగన్న కన్నుమూత: విప్లవ లోకానికి తీరని లోటు 
సంతాపం తెలిపిన పాలేరు నియోజకవర్గ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు మందడి ఇజ్రాయిల్



రిపోర్టర్ :దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం,జూన్ 3(నమస్తే న్యూస్ )

తిరుమలయపాలెం మండలం అరుణోదయ వ్యవస్థాపక నాయకులు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ అరుణోదయ నాగన్న (శుక్రవారం) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.నాగన్న మరణం విప్లవ పోరాట లోకానికి తీరని లోటని పాలేరు నియోజకవర్గ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు మందడి ఇజ్రాయిల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాగన్న మృతికి సంతాపం తెలుపుతూ ఆయన విప్లవ జోహార్లు అర్పించారు. ప్రజా ఉద్యమాలకు నాగన్న చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఇజ్రాయిల్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System