Type Here to Get Search Results !

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం.

NAMASTHE NEWS 0

  • కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరిని ఖండించిన బీజేపీ శ్రేణులు.
  • అక్రమ అరెస్టులతో బీజేపీని అణచలేరు.
  • నర్సింహులపేటలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన.
  • రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం





నర్సింహులపేట,జూలై 23 (నమస్తే న్యూస్)

ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును, తెలంగాణలో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండిస్తూ నరసింహులపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘిస్తూ శాంతియుత నిరసనలను అణచివేస్తోందని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దాసరి మురళి, జిల్లా కార్యదర్శి సింగారపు సతీష్, సత్యనారాయణ రెడ్డి, దాసరి వీరన్న, కాలు నాయక్, సూరబోయిన సందీప్, భోగి అనిల్, ఉంగరాల వెంకన్న, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System